అమరావతి స్విస్ మోడల్‌పై అధ్యయనం: 10 మంది సభ్యులతో ఓ కమిటీ

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గాను సింగపూర్ ప్రభుత్వం 'Ascendas-Singbridge and Sembcorp Development Ltd' ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అందులో సాధ్యాసాధ్యాలయను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఆర్ధక మంత్రి యనమల రామకృష్ణుడు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్విస్ ఛాలెంజ్ మోడల్‌పై ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 10 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది.

ఇందులో భాగంగానే రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులను సీఆర్డీఏ, సీసీడీఎంసీ పంచుకోనున్నాయి. ఈ కమిటీలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంఎ అండ్ యుడి (సిఆర్‌డిఎ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కుటుంబరావు, క్యాపిటల్ సిటీ డవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఎండి డి లక్ష్మీ పార్థసారథి, సిఆర్‌డిఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్, ఎంఎ అండ్ యుడి నుంచి ప్రకాష్ గౌర్, చార్టర్డ్ అక్కౌంటెంట్ బిఎస్ చక్రవర్తి, శరత్ కుమార్ సభ్యులుగా ఉంటారు.

AP Govt Forms Panel to Study Swiss Model for Development of Amaravati

సీఆర్డీఏ పరిధిలో సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాలు

గతేడాది సీఆర్‌డీఏలోని వివిధ విభాగాల్లో మొత్తం 223 పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసే ప్రక్రియ చేపట్టామని పురపాలక మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఎంపికైన వారికి నియామకపు ఉత్తర్వులను ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. వారందరినీ త్వరలో ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఆర్డీఏ వారికి వెంటనే నియామకపత్రాలను పంపనుంది.

బ్లూ కన్సల్టెంట్‌గా ఆర్కాడిస్‌
అమరావతిని 'బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్(జలవనరులు- పచ్చదనం)'తో నిర్మించనున్న దృష్ట్యా దాని బ్లూ(జలవనరులకు సంబంధించి) కన్సల్టెంట్‌గా నెదర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'ఆర్కాడ్‌స్'ను ఎంపిక చేశామని చెప్పారు. ఇది రాజధానిని వరద ముంపు నుంచి రక్షించేందుకు అవసరమైన సకల చర్యలనూ సూచించడంతోపాటు జలరవాణా, జలాశయాల అభివృద్ధి, తాగునీటిపై సలహాలు, సూచనలు ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+