అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయం - ఇక నుంచి..!!
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం మంజూరు అయింది. నిర్మాణాల కొనసాగింపు కోసం సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. గతంలో నిలిచి పోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆర్దికంగ గా నిధుల సమీకరణతో సిద్దమైన ప్రభుత్వం నిర్మాణాల వేగం పెంచాలని డిసైడ్ అయింది.
నిర్మాణాలు మొదలు
అమరావతిలో కీలక అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ వారంలోనే దాదాపు 40 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈనెల 12 నుంచి 15 లోపు పనులు ప్రారంభించనున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా నిధుల సమీకరణకు రుణం కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కోలతో ఒప్పందం చేసుకున్నారు. రుణాల ద్వారా దశల వారీగా అమరావతి కోసం రూ 31వేల కోట్లు రానున్నాయి. నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సీఆర్డీఏ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల వీటి ఖరారు ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లను ఖరారు చేసారు.

అధికారుల కసరత్తు
అమరావతిలో కొనసాగిస్తున్న నిర్మాణాల్లో భాగంగా గతంలో నిర్ణయించిన భవనాల డిజైన్లలో మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. తాజాగా అమరావతిలో 90 పనులు చేయాలని నిర్ణయించింది. వీటిలో రూ.48,000ల కోట్లతో 73 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో రూ.40,000 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలిచింది. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీల న అనంతరం ఏజెన్సీలను ఫైనల్ చేశారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లలో నాలుగు పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలుకాలేదు. ఎన్జీఓ, జీఓ క్వార్టర్ల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ ముం దుకు రాలేదు. వీటికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.
ప్రణాళికా బద్దంగా
తాజాగా 8 పనుల టెండర్లను తెరిచారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు టెండర్ల గడువు ఈ నెల 5తో ముగిసింది. బంగ్లాలకు సంబంధించి రెండు పనుల టెండర్ల గడువు 7తో ముగిసింది. సాంకేతిక బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలిస్తున్నారు. వీటిని రెండో కమిటీ పరిశీలనకు పంపనున్నారు. ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్ఠత పరిశీలించాక నిర్మా ణానికి వీలుగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రణాళికా బద్దంగా అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి నిర్మాణాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం.. మూడేళ్ల కాల పరిమితి నిర్దేశించింది.












Click it and Unblock the Notifications