'అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే - తాజా నిర్ణయంతో..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం బడుల ప్రారంభం లోగా అందించాలని నిర్ణయించారు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వ నిర్ణయం
వైసీపీ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకం కు అన్నదాత సుఖీభవ గా కూటమి ప్రభుత్వం పేరు మార్పు చేసింది. ప్రతీ ఏటా రైతులకు రూ 20 వేలు ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ రూ 6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్దిక సాయంగా అందిస్తా మని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఏడాది పాలన లో ఈ పథకం అమలు కాలేదు. కాగా, ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల పైన కసరత్తు పూర్తయింది. అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతల పైన సూచనలు చేసారు.

పీఎం కిసాన్ తో కలిపి
ఇక, ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతులుగా రూ 14 వేల మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇక.. జూన్ లో పీఎం కిసాన్ మలి విడత నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జూన్ 15 తరువాత కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ 5 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా కేంద్రం సొమ్ము మూడు విడతలుగా జమైతే, రాష్ట్రప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా రూ.5,500, రెండో విడతగా జనవరిలో రూ.రెండు వేలు అందిస్తుంది.
తొలి విడత నిధులు
ప్రభుత్వం ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటుగా నిధులు జమ చేయాల ని నిర్ణయించటంతో జూన్ మూడో వారంలో ఈ పథకం తొలి విడత నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తల్లికి వందనం నిధులు పాఠశాలలు వేసవి సెలవుల తరువాత తిరిగి ప్రారంభం అయ్యే లోగా అందించా లని ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా చెల్లింపు అంశం ప్రతిపాదన వచ్చినా.. రాజకీయం గా విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఒకే విడతలో చెల్లింపుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు కావాల్సిన నిధులను సిద్దం చేయాలని ఆర్దిక శాఖ అధికారులకు సూచించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇక.. మరో హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం మాత్రం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.












Click it and Unblock the Notifications