చంద్రబాబు బయటకు వచ్చేది అప్పుడేనా - ఏం జరుగుతోంది..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు ఎప్పుడు వస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బిగ్ టాపిక్. గత ఆదివారం అర్ద్రరాత్రి నుంచి చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ రోజుల చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లపైన హైకోర్టులో విచారణ జరిగింది. వరుసగా మూడు పిటీషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో, ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు...
హైకోర్టులో పిటీషన్లు..వాయిదా : చంద్రబాబు స్కిల్ స్కాం రిమాండ్ రిపోర్టులో దాఖలైన క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసారని..ఈ కేసులో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్ధించారు.

వీటిని పరిశీలించిన న్యాయస్థానం సీఐడీ వాదనలు వినేందుకు ఈ నెల 19వ తేదీకి కేసు వాయిదా వేసింది. 18, 19 తేదీల్లో వినాయక చవితి సెలవు ఆధారంగా విచారణ జరగనుంది. అదే సమయంలో అమరావతి రింగ్ రోడ్డులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.
19వ తేదీన విచారణకు ఛాన్స్ : చంద్రబాబు హైకోర్టులో వరుస పిటీషన్లు దాఖలు చేసారు. స్కిల్ స్కాంలో తన ప్రమేయం లేదని..సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హకోర్టును అభ్యర్దించారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు నినిపించారు. ప్రాధమిక ఆధారాలు లేకపోయినా చంద్రబాబు పైన కేసు నమోదు చేసారని కోర్టుకు వివరించారు.
సీఐడీ నమోదు చేసిన కేసుతో పాటుగా రిమాండ్ ఉత్తర్వుల ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి లేదనేది ఆయన తరపు న్యాయవాదుల వాదన. రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. దీని పైన సీఐడీ కౌంటర్ దాఖలు చేసేందుకు కేసును ఈ నెల 19కి వాయిదా వేసారు.

ఆ తరువాతే బయటకు : ఇక, చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను కోర్టు 18వ తేదీకి పోస్ట్ చేసింది. దీంతో, క్వాష్ పిటీషన్ పైన కోర్టు నిర్ణయం వెలువడే వరకూ చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం ఇప్పటి వరకు పిటీషన్లు దాఖలు కాలేదు.
క్వాష్ పిటీషన్ ఫైల్ చేయటంతో బెయిల్ పిటీషన్ వేస్తారా లేదా అనే దాని పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, 19వ తేదీన సీఐడీ కౌంటర్.. రెండు పక్షాల వాదనల తరువాతనే కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సీఐడీ కౌంటర్ కు మరింత సమయం కోరితే..ఈ ప్రక్రియ కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో, చంద్రబాబు జైలు నుంచి బయటకు రావటం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications