సెక్యూరిటీ గార్డు కాల్పులు: ఉగండాలో ఆంధ్ర వ్యక్తి మృతి

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఎ వేమరప్పాడుకు చెందిన సంజయ్ (47) అనే వ్యక్తి ఉగండాలో హత్య గురయ్యాడు. సంజయ్ 17 ఏళ్లుగా వ్యాపారం, ఉద్యోగం రీత్యా కుటుంబ సభ్యులతో కలిసి ఉగండాలోనే ఉంటున్నాడు.

ప్రస్తుతం గ్రోమోర్ సీడ్స్ కంపెనీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి కంపాల నగరంలో సంజయ్‌ని ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చి చంపాడు. సెక్యూరిటీ గార్డు డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వడానికి సంజయ్ నిరాకరించడంతో కాల్పులకు తెగబడ్డాడని సమాచారం.

AP person dies in Uganda firing

శరీరంలోకి ఎనిమిది బుల్లెట్లు దూసుకుపోయి గాయపడిన సంజయ్‌ని ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసిన ఉగండా పోలీసులు పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని భారత్‌కు పంపించారు.

మృతదేహం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఎ వేమవరప్పాడు తరలించారు. సంజయ్‌కి భార్య సుహాసిని, కూతురు ఉదయ సాయి సాధన, కుమారుడు విష్ణురాజ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+