జరిగిందేదో జరిగింది: రాష్ట్ర విభజనపై వెంకయ్య నాయుడు

విజయవాడ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేద్దామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెడుతుందో పెట్టదో అనుకున్నానని, పెడితే పాస్ కాకుండా చేసి దాన్ని బిజెపి మీద నెట్టేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు.

రెండేళ్ల ముందే విభజన చేసివుంటే ఉంటే ఇంత ఆందోళన ఉండేది కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీలోని నాయకులతోనే చర్చించకుండా రాష్ట్ర విభజనకు పూనుకుందని వెంకయ్య ఆరోపించారు. రాష్ట్ర విభజనపై తాను 2013, ఆగస్టు 10 రాజ్యసభలో ప్రస్తావించానని, తొలిసారి విభజనపై స్పందించింది బిజెపియేనని చెప్పారు. రాష్ట్ర విభజనతో ఎదురయ్యే పరిణామాలపై కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించానని వెంకయ్య తెలిపారు. దీంతో తెలంగాణ ప్రాంతంవారు తనను అపార్థం చేసుకున్నారని అన్నారు.

Venkaiah Naidu

రాజ్యసభలో కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తమతో విభజనపై చర్చించలేదని చెప్పారని వెంకయ్య అన్నారు. విభజనపై కేంద్రమంత్రి చిదంబరం లోతుగా చర్చించామని చెబుతున్నారని అన్నారు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉన్నకాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ పార్లమెంటు సభ్యులే వ్యతిరేకించారని ఎద్దేవా చేశారు. తాము రాజకీయ ప్రజయోనాలను బేరీజు వేసుకుని విభజనపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన తన మనసును గాయపరిచిందని వెంకయ్య నాయుడు తెలిపారు. జరిగిపోయిన రాష్ట్ర విభజన గురించి ఆలోచించకుండా అభివృద్ధిపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఎన్నికలకు 40 రోజుల ముందు విభజన చేపట్టిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రాజీనామా తప్ప మరే ఇతర ఎంపీల రాజీనామాలు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయడం, మళ్లీ పార్టీలో చేరడం సాధారణమేనని అన్నారు. ఏదైనా అమ్మ కోసమే చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ దమన నీతిని ప్రజలు గమనించాలని వెంకయ్య నాయుడు కోరారు. సీమాంధ్రకు న్యాయం చేసేందుకే బిజెపి పార్టీ పోరాటం చేసిందని ఆయన అన్నారు. సీమాంధ్రకు కేటాయించిన ప్యాకేజీని సరైన విధంగా అమలు చేస్తే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+