ఏపీకి కాబోయే సీఎం ఎవరు?- ప్రముఖ సర్వే సంస్థ సంచలన రిపోర్ట్

అమరావతి: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.

అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలనే ఉద్దేశంలో ఉంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన సైతం ఈ కూటమితో చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు.

 AP Survey Results:

వైఎస్ఆర్సీపీ ఒకవంక- మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరోవంక.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. దీన్ని కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది ఈ సర్వే సంస్థ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనేది స్పష్టం చేసింది.

ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం.. 49. 49 శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.

 AP Survey Results:

జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ రెండు పార్టీలకు కలిపి 41 శాతం ఓట్లు పడొచ్చని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులకు మరో 10 శాతం ఓట్లు పోల్ అవుతాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఇష్టపడే వారి సంఖ్య 56 శాతంగా నమోదైంది.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడిని మళ్లీ సీఎంగా చూడాలనుకునే వారి సంఖ్య 37 శాతమే. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అవుతారంటూ ఏడు శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి వ్యక్తం కావట్లేదని పేర్కొంది.

56 శాతం జగన్ పరిపాలనను మెచ్చుకుంటోన్నారు. ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తోన్నారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం.. 9గా నమోదైంది. 22 శాతం మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వం అధ్వాన్నంగా పని చేస్తోందంటూ ఎనిమిది శాతం మంది, ఎటూ చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+