చంద్రబాబు స్ఫూర్తి: ముహూర్తం ఖరారు, సచివాలయంలో కొలువుదీరే తొలి శాఖలివే
అమరావతి: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభానికి ముహుర్తాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నాం 2.59 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
సచివాలయంలోని ఐదోవ బ్లాక్ కింది అంతస్తులో నాలుగు శాఖలను ప్రారంభించనున్నారు. కాగా, తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదటగా తరలే శాఖల వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ సోమవారం అధికారులతో సమీక్షించారు.
తొలిదశలో భాగంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు తమ తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. తదుపరి భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మరిన్ని శాఖలు వస్తాయని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఉద్యోగులంతా జూన్ 27 (సోమవారం) నుంచి సొంత రాష్ట్రంలో విధులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ తాత్కాలిక రాజధానిగా కొనసాగుతున్న విజయవాడ చుట్టుపక్కల 30కిపైగా కార్యాలయాలు కొలువుదీరాయి.
చాలా శాఖల కార్యాలయాలు సొంత భవనాల్లో, కొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో మొదలవుతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి గత వారం పది రోజులుగా తమ కార్యాలయాలను తరలించిన అధికారులు, సిబ్బందికి ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశారు.
సోమవారం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో అన్ని ప్రభుత్వశాఖలు తరలివస్తున్నాయని, ఇక నుంచి మరింత వేగవంతమైన పాలన జరుగుతుందని అన్నారు.
భవిష్యత్ తరాల కోసం ఉద్యోగులు త్యాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానికి తరలిరావాల్సిన చారిత్రక అవసరాన్ని ఉద్యోగులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.1090 కోట్ల బడ్జెట్‌తో లక్షమంది యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దళిత యువతికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను అన్ని రకాలుగా బలోపేతం చేస్తామని జూపూడి స్పష్టం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications