Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ఎన్నికల రాజకీయంలో అనూహ్య ట్విస్ట్ - ఎవరిని గెలిపిస్తారు..!!

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తుల పైన మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు జగన్ సింగిల్ గానే పోటీకి సిద్దమయ్యారు. బీజేపీ 2014 తరహా పొత్తులకు సిద్దమా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి 793 మంది 175 స్థానాలకు దరఖాస్తు చేసారు. దీంతో, హోరా హోరా ఎన్నికల రాజకీయంలో కాంగ్రెస్ ఎవరిని గెలిపిస్తుంది..ఎవరిని ఓడిస్తుందనే చర్చ మొదలైంది.

ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పు కనిపిస్తోంది. షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అన్న సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. 2014,2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ సారి కొంత మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సీటు ఆశించే వారి నుంచి పార్టీ దరఖాస్తుల స్వీకరించింది. అనూహ్య స్పందన కనిపించింది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 పార్లమెంట్ స్థానాల్లో 105 అప్లికేషన్లు వచ్చాయి.

APCC Recieved 793 Applications for 175 Assembly seats for next Elections, become big turn in AP Politics

ఈ రోజు అప్లికేషన్లకు చివరి రోజు కావడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్దులను ఖరారు చేయనుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా అధిక సంఖ్యలో వైసీపీ, మిగిలిన వారు టీడీపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లొ పోటీకి ఆశావాహులు ముందుకు వస్తున్నారు. అయితే, కాంగ్రెస్ తిరిగి ఏ మేర ఇతర పార్టీలకు పోటీ ఇవ్వనుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటునే కాంగ్రెస్ అభ్యర్దులు చీల్చే అవకాశం ఉంటుందనేది వైసీపీ నేతల అంచనాగా కనిపిస్తోంది.

వైసీపీ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నే నమ్ముకుందని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ వైసీపీకి ప్రస్తుతం అనుకూలంగా ఉందనేది ప్రతిపక్ష పార్టీల వాదన. కాంగ్రెస్ దక్కించుకొనే ఓట్ బ్యాంక్ వైసీపీ కి నష్టం చేస్తుందని లెక్కలు చెబుతున్నారు. ఇటు షర్మిల రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో పాటుగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి 2014 పొత్తులు రిపీట్ చేయాలని భావిస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎవరికి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+