ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా
మే 18న విడుదల కావల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఏపి ఏన్‌సీహెచ్ఈ చైర్మణ్ విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలో హజరైన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.ఫలితాల విడుదలపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాల్లో గందరగోళం జరిగిన నేపథ్యంలోనే ,విద్యార్థులు రీవ్యాల్యుయోషన్‌తో పాటు, రీవెరిఫికేషన్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. వీటీ ఫలితాలు మే 27న ప్రకటించనున్నారు. ఇందుకోసం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఏపి ఎంసెట్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటించనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications