దాడి: హర్షకుమార్ తనయుల అరెస్ట్, క్షమాపణ

సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎంపి కుమారులు శ్రీరాజ్, సుందర్, అనుచరులు.. పోలీసులు ఉండగానే ఎన్జివో నేతలపై కర్రలతో దాడి చేసి దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎపిఎన్జీవో నేతలు భారీ సంఖ్యలో కళాశాల వద్ద చేరుకుని కళాశాల అద్దాలను, బస్సులను ధ్వంసం చేశారు. తమ నాయకులపై దాడి చేసిన ఎంపి తనయులను, అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమైక్య రాష్ట్రం కోసం 60రోజులుగా మేమంతా ఉద్యమం చేస్తుంటే తమపై దాడి చేయడం ఏంటని ఎపిఎన్జివో నేతలు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు కళాశాల ఎదటు ఆందోళన నిర్వహించారు. కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. మొదట ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఎంపి హర్షకుమార్ తనయులిద్దర్నీ అరెస్ట్ చేశారు. చికిత్స నిమిత్తం గాయపడిన ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు.
కాగా ఘటనపై స్పందించిన ఎంపి హర్షకుమార్ ఎపి ఎన్జివో నేతలకు క్షమాపణలు చెప్పారు. తమ కుటుంబం మొత్తం సమైక్యవాదానికి కట్టుబడి ఉందని అన్నారు. మా కాలేజీని ఎప్పుడో మూసేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని హర్షకుమార్ అన్నారు. మమ్మల్ని టార్గెట్ చేయడం వెనక కొందరు సంఘ విద్రోహుల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications