అమ్మాయిపై అరబ్ షేక్ అత్యాచారయత్నం, అరెస్టు

అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాడ్జిలో తనిఖీలు నిర్వహించి మరో బాలికను రక్షించారు. నిందితుడు రషీద్‌బిన్ మౌసద్ సహ 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో నలుగురు మహిళా బ్రోకర్లు ఉన్నట్లు, ఓ ఖాజీ ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్‌కు చెందిన ముగ్గురు ఆరవ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలావుంటే, విశాఖపట్నంలోని మాధవధారలో ఓ ద్విచక్రవాహనాన్ని పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications