ఏపీ సంతృప్తిగానే ఉంది: హోదాపై తేల్చిన అరవింద్ పనగరియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ఏపీకి హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక హోదా అంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు ప్రత్యేకంగా ఇవ్వడం మాత్రమేనని స్పష్టం చేశారు.

14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక మొత్తం నిధులు రాష్ట్రాలకే వెళ్తున్నాయన్నారు. కాగా, ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని, దేశంలో ఆ కేటగిరీకి చెందిన 11 రాష్ట్రాలు మాత్రమే ఇప్పటికే ఆ హోదా అనుభవిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వనవసరమే లేదని కూడా తేల్చేసింది.












Click it and Unblock the Notifications