సమ్మెపై చర్చిస్తాం, 9న జాతి విద్రోహ దినం: అశోక్ బాబు

ఐదు నుండి 9వ తేది వరకు నిరసన ప్రదర్శనలు, దీక్షా శిబిరాలు ఉంటాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే తాము అసెంబ్లీని ముట్టడించి విభజన పైన వ్యతిరేకతను తెలియజేస్తామన్నారు. తాము రాష్ట్ర విభజనతో పాటు రాయల తెలంగాణను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.
తాము సమైక్యాంధ్ర కోసం ఇప్పటికే కొన్ని పార్టీలను కలిశామని, ఈ రెండు రోజుల్లో మరికొన్ని పార్టీలను కలుస్తామని చెప్పారు. తాము సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు మోయాలని కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించినా, కలిసున్నా రాజకీయ పార్టీలో పాలనను కొనసాగిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే విప్‌లతో సంబంధం లేకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా ఓటేస్తామని సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తమకు హామీ ఇచ్చారని చెప్పారు.
ఢిల్లీకి తెలంగాణ సారథ్య బృందం
కాగా, ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి తెలంగాణ సారథ్య బృందం వెళ్లనుంది. సోమవారం రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ ఇంట్లో వారు భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications