మహిళపై కారులో అత్యాచారయత్నం, ముగ్గురి హత్య

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశపెట్టి మహిళను కారులో తీసుకుని వెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Attempted rape on a woman in car

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం గజ్జనపూడిలో రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న తగాదా ముగ్గురు దారుణ హత్యకు దారి తీసింది. దారి విషయంలో రెండు ఇళ్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తండ్రి, ఇద్దరు కుమారులపై ప్రత్యర్థులు బల్లేలాతో దాడి చేశారు. ఈ దాడిలో బొబ్బిలి సత్యనారాయణ, అతని కుమారులు లక్ష్మీనారాయణ, అర్జుబాబు మరణించారు. నిందితులు పరారీలో ఉన్నారు.

మెడికల్ ఆఫీసర్ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో మెడికల్ ఆఫీస్ డాక్టర్ కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఒంగోలులోని రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోదూకి కీర్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+