మంత్రాలకు పిల్లలను పుట్టిస్తానని మహిళలను రేప్ చేసిన నకిలీ బాబా
కర్నూలు: మంత్రాలకు పిల్లలను పుట్టిస్తానంటూ నమ్మించి ఓ నకిలీ బాబా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి అనే వ్యక్తి స్థానికంగా జులాయి. ఇతను నందికొట్కూరు రాజా వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తాను మంత్రాలతో పిల్లలను పుట్టిస్తానంటూ ఇంటి వెలుపల బోర్డు పెట్టి విస్తృతంగా ప్రచారం చేశాడు.
ఈ ప్రచారానికి ఆకర్షితులైన సంతానంలేని మహిళలు బాబా వద్దకు రావడం మొదలు పెట్టారు. దీంతో వారంలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండేది. అలా వచ్చిన మహిళలను ఒక్కొక్కరిగా తన వ్యక్తిగత పూజగదిలోకి తీసుకెళ్లి ఓ రకమైన ఆయిల్ వాసనను పీల్చమనేవాడు. ఈ ఆయిల్ వాసన చూడగానే ఆ మహిళ అపస్మారకస్థితిలోకి జారుకునేది.

ఆ తర్వాత ఆమెపై దాడి చేయడం రోజువారీగా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజున ఒక మహిళ ఒంటరిగాకాకుండా, తన భర్తతో కలిసి బాబా వద్దకు వచ్చింది. భర్తను బయటే ఉండమని చెప్పి ఆ మహిళను తన గదిలోకి తీసుకెళ్లిన బాబా ఆమెకు కూడా ఆయిల్ వాసన చూపించి శృంగారంలో పాల్గొన్నాడు.
అయితే, లోనికి వెళ్ళిన తన భార్య ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన ఆమె భర్త గదిలోకి వెళ్లి చూసి స్థానువయ్యాడు. తన భార్యపై అత్యాచారం చేయడాన్ని చూసిన ఆ వ్యక్తి ఆగ్రహంతో దొంగబాబాకు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా, అతని నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు బాబాను పట్టుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications