ఉగ్రవాదాన్ని సహించేది లేదు: బాలకృష్ణ
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉగ్రవాదం అంశంపై మాట్లాడారు. ఉగ్రవాదులు హద్దుమీరితే.. ప్రజలెవరూ సహించరని అన్నారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేదని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఉందని.. అయినప్పటికీ దేనికైనా ఓ హద్దు ఉంటుందని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందన్నారు. తీవ్రవాదులు మాట వినకపోతే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితిలు
జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆక్నూర్ సెక్టార్ లోని పంజ్ తూట్ గ్రామాన్ని సైనికులు, అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆక్నూర్ సెక్టార్ లో పాకిస్థాన్ సైనికులు నిన్న కాల్పులకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
కాగా, గడచిన రెండు రోజుల్లో ఆక్నూర్ సెక్టార్ లో కాల్పుల నిబంధన ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడటం ఇది మూడోసారి. అయితే, పాక్ సైన్యానికి దీటుగా మన బీఎస్ఎఫ్ జవాన్లు సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications