పొద్దున్నే లేచి చంద్రబాబు ఇంటివద్ద బాలకృష్ణ బోగిమంట, కోడి పందాలకు నిర్మాతల క్యూ
విజయవాడ: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నారావారిపల్లె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం. ఇక్కడి సంక్రాంతి వేడుకల్లో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
బాలకృష్ణ బోగి మంటలు వేసి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు బాలకృష్ణ బుధవారం రాత్రి నారావారిపల్లె చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. బావాబావమరిది (బాలకృష్ణ, చంద్రబాబు) కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

గురువారం వేకువజామునే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణ బోగిమంటలు వేశారు. మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు, బాలకృష్ణ సందడి చేశారు.
కోడి పందాల కోసం టాలీవుడ్ నిర్మాతలు, తెలంగాణ నుంచీ...
సంక్రాంతి పర్వదినం అంటే ఏపీలో కోడి పందాలు గుర్తుకు వస్తాయి. ఈ కోడి పందాల కోసం పలువురు నిర్మాతలు కూడా కృష్ణా, గోదావరి జిల్లాలకు వరుస కట్టారు. వారు కోడి పందాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పలువురు కోడి పందాలకు తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications