ట్విస్ట్: 'ప్రశాంత్ కిషోర్ సర్వే, అందుకే బాబుపై జగన్ కాల్చివేత వ్యాఖ్య'

వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహానీ ఉందని టిడిపి నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహానీ ఉందని టిడిపి నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

నంద్యాలలో గురువారం వైసిపి నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుపై జగన్ సహా వైసిపి నేతలు తీవ్ర విమర్శలు చేశారని, ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు.

ప్రశాంత్ కిషర్ సర్వే.. అందుకే జగన్‌పై కాల్చివేత వ్యాఖ్య

ప్రశాంత్ కిషర్ సర్వే.. అందుకే జగన్‌పై కాల్చివేత వ్యాఖ్య

ఏపీలో చంద్రబాబు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలిందని, అందులో పన్నాగమే నిన్న జగన్ నంద్యాలలో ఈ వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తారనే జగన్ కాల్చివేత వ్యాఖ్యలు అని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబును అందుకు కాల్చి చంపాలా?

చంద్రబాబును అందుకు కాల్చి చంపాలా?

ముఖ్యమంత్రి కనుసైగ చేస్తే ఎక్కడైతే ఆయనపై విమర్శలు చేశారో అక్కడే వైసిపి నేతల నాలుకలు కోస్తామని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన భుజస్కందాలపై వేసుకొని కష్టపడి పని చేస్తున్నందుకు ఆయనను కాల్చి చంపమంటున్నారా అని జగన్‌ను నిలదీశారు.

జైలుకు వెళ్లలేదని కాల్చాలా?

జైలుకు వెళ్లలేదని కాల్చాలా?

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని, జగన్‌లా 16 నెలలు జైలు శిక్ష అనుభవించలేదని చంద్రబాబును కాల్చి చంపమంటున్నారా అని బుద్ధా వెంకన్న నిలదీశారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు.

జగన్ వ్యాఖ్యల కలకలం

జగన్ వ్యాఖ్యల కలకలం

నంద్యాలలో జగన్ కాల్చివేత వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. నంద్యాలలో పులివెందుల రాజకీయమా అంటూ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. సీఎంను కాల్చి చంపుతాననడంతో జగన్‌ స్థాయి ఏమిటో అర్థమవుతోందన్నారు. విశ్వసనీయత కలిగిన నేతగా చంద్రబాబుకు పేరు ఉంటే.. లక్ష కోట్లు దోచుకున్న నేతగా జగన్‌కు పేరు ఉందన్నారు. జగన్‌ది చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తే అన్నారు.

ఫ్యాక్షన్‌కు రోల్ మోడల్

ఫ్యాక్షన్‌కు రోల్ మోడల్

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమానికి రోల్‌ మోడల్‌గా ఉంటే, జగన్ రక్త చరిత్రకు, ఫ్యాక్షన్‌కి రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారన్నారు. ప్రజలు ఫ్యాక్షన్‌ను వదులుకొని అభివృద్ధి వైపు అడుగులేస్తుంటే జగన్‌ మాత్రం వారిని ఫ్యాక్షన్‌ వైపు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+