భోగి సంబరాలు ఇలా - గ్రహ, జాతక దోషాలు తొలిగేలా..!!

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి మంగలు.. రంగు రంగుల రంగ వళ్లులతో అసలైన సంక్రాంతి సందడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వేకువ జామునే భోగి మంటలతో సందడి చేస్తున్నారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో పండుగ జోష్ పెంచుతున్నారు.పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భోగి మంటలు వేశారు. ఈ భోగి మంటలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

భోగి సందడి
సంక్రాంతి తొలి రోజైన భోగి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి కొనసాగుతోంది. పాడిపంటలు ఇంటికి వచ్చిన వేళ భోగి వేడుకలను ప్రతీకగా నిర్వహిస్తున్నారు. ఇక, భోగి మంటల్లో ఇంట్లో పాత సామాన్లు, అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను సైతం వేస్తూ సంప్రాదయ బద్దంగా నిర్వహిస్తున్నారు. అయితే భోగి మంటల పక్కన ఒక బిందెడు నీళ్లను ఉంచాలని.. ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ నీటిని బకెట్లో కొన్నింటిని పోసుకోని స్నానం చేయడం ద్వారా గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. అదే విధంగా జాతక దోషాలకు భోగి పరిహారం చూపిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

Bhogi is celebrated with the traditional bonfire across the telugu states

దోషాలు తొలిగేలా
ఇందు కోసం ఒక ఎర్రటి వస్త్రంలో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, రెండు గోమతి చక్రాలు వేసి మూట కట్టాలని సూచిస్తున్నారు. దానితో భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తరువాత..ఆ మూటను మంటలో వేయాలి. ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని.. ఆ వెంటనే అదృష్టం కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలు సైతం ఉండవని వివరిస్తున్నారు. ఇక, శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణ యానంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు.

ఎన్నో ప్రత్యేకతలు
తెలుగు రాష్ట్రాల్లో భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. ఇక, పలు ప్రాంతాల్లో ఈ సారి ప్రజా ప్రతినిధులు సైతం ఉత్సాహంగా భోగి వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి ఉత్సాహంగా జరుపుకు న్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వెళ్లిన వారంతా సంక్రాంతి వేడకులకు సిద్దమయ్యారు. భోగి నుంచి పండుగకు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్య క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. పలువురు మంత్రులు తమ నివాసాల్లో ప్రత్యేకంగా భోగి వేడుకలను నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+