మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాని దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఈ వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇప్పటికే తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన స్పష్టం చేసింది. అలానే కాకాణి క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

కాకాణిపై నమోదైన కేసు విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు వారు ముగ్గురు సమయం కోరారు. అంతే కాకుండా కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో హైదరాబాద్ లో ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు.
పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదని పోలీసులు చెబుతున్నారు. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని అంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని స్పష్టం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications