జగన్ పథకాన్ని అమలు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం
ఏపీలో జగన్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ , జనసేన పార్టీలు జత కట్టాయి. సింగిల్‌గా పోటీ చేస్తే జగన్‌ను ఓడించడం కష్టమని భావించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఈక్రమంలోనే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 10 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించి కూటమి తరుఫున ప్రచారం నిర్వహించారు. అయితే మోదీ తన పర్యటనలో ఎక్కడా కూడా వైసీపీ పాలన మీద కానీ, జగన్ మీద కానీ విమర్శలు చేసింది లేదు. దీనిపై టీడీపీ, జనసేన శ్రేణులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో అమలు అవుతున్న ఓ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

జగన్ అమలు చేస్తోన్న విధానాన్ని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జగన్ సర్కార్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రైవర్ సీటు ముందు భాగంలో వారి కుటుంబ సభ్యుల ఫొటోలను, గ్రూప్ ఫొటోలను అతికిస్తున్నారు. డ్రైవర్ బస్సును ఇష్టారీతిన డ్రైవ్ చేసే ముందు.. మీకో కుటుంబం ఉంది.. జాగ్రత్త అని హెచ్చరించడమే దీని ఉద్దేశం.
విచిత్రం ఏమిటంటే జగన్ ప్రభుత్వం ఇలా డ్రైవర్ సీటు ముందు ఫ్యామిలీ ఫొటోలు పెట్టిన తరువాత ప్రమాదాలు తగ్గాయి. 2023 జనవరిలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది జనవరి నాటికి 5 శాతం మేరకు ప్రమాదాలు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న యూపీ ప్రభుత్వం ఏపీలో పర్యటించి ఆర్టీసీ అధికారులతో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బాగుంది. ఈ చర్య ద్వారా ప్రమాదాలు తగ్గాయి. మేం కూడా దీనిని పాటిస్తామని యూపీ రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications