పవన్ రివర్స్, జగన్‌తో కలవాలనుకుంటున్నారు: బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మంగళవారం నాడు మరోసారి పవన్ పైన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను పాచిపోయిన లడ్డూలు అన్నందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

పవన్ పాచిపోయిన లడ్డూల వంటి వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో కలవాలనకుంటున్నారని ధ్వజమెత్తారు. తాను అడిగే ఐదు ప్రశ్నలకు పవన్ సమాధానం చెబితే, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

Siddharth Nath Singh

పవన్‌కు అవగాహన లేదన్నారు. పవన్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకయ్య గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన పవన్ రివర్స్‌లో ప్రయాణిస్తున్నారన్నారు. పవన్ అసహనంతో ఉన్నాడన్నారు.

తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ బీజేపీని టార్గెట్ చేశారు. అయితే, కాకినాడ సభలో మాత్రం దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని, పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి వెంకయ్యను కూడా టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+