వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దండం: తెరాసలోకి నరేంద్రనాథ్, ఫరీద్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ ఎంపి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను పూర్తిగా బలహీన పరిచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహ్మారెడ్డి ఇప్పటికే మెదక్ పార్లమెంటు నియోజక వర్గలో పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు స్వామిచరణ్, గత ఎన్నికల్లో మెదక్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నరేంద్రనాథ్, జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌లు సిఎం కె చంద్రశేఖర్ రావు సమక్షంలో గురువారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఇది ఇలా ఉండగా ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు 11 మంది ఎంపిటిసిలు, 24 మంది సర్పంచ్‌లు వైయస్సార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కెసిఆర్ సమక్షంలో వీరంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ , ఇతర నాయకులు టిడిపికి రాజీనామా చేసి త్వరలోనే టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి టిఆర్‌ఎస్ తరఫున జలగం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఉప ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కెసిఆర్

కెసిఆర్

మెదక్ ఎంపి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కెసిఆర్

కెసిఆర్

విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను పూర్తిగా బలహీన పరిచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహ్మారెడ్డి ఇప్పటికే మెదక్ పార్లమెంటు నియోజక వర్గలో పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.

కెసిఆర్

కెసిఆర్

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు స్వామిచరణ్, గత ఎన్నికల్లో మెదక్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నరేంద్రనాథ్, జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌లు సిఎం కె చంద్రశేఖర్ రావు సమక్షంలో గురువారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

కెసిఆర్

కెసిఆర్

ఇది ఇలా ఉండగా ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఆయనతో పాటు 11 మంది ఎంపిటిసిలు, 24 మంది సర్పంచ్‌లు వైయస్సార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కెసిఆర్ సమక్షంలో వీరంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఇక అదే జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

కెసిఆర్

కెసిఆర్

తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ , ఇతర నాయకులు టిడిపికి రాజీనామా చేసి త్వరలోనే టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఖమ్మం జిల్లా నుంచి టిఆర్‌ఎస్ తరఫున జలగం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఉప ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary
Bharatiya Janata Party leader Nagendra Nath and former minister Fariduddin on Thursday joined in Telangana Rashtra Samithi on the presence of Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X