రుషికొండ భవనాలపై అనూహ్య ట్విస్ట్..!!

విశాఖ రుషికొండ భవనాలను ఏం చేయబోతున్నారు. జగన్ హయాంలో నిర్మించిన ఈ భవనాల వినయోగం పైన కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. విశాఖ సాగర తీరాన నిర్మానం పూర్తి చేసుకున్న ఈ భవనాలను ఇప్పటికే సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ సందర్శించారు. వినియోగం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేత విష్ణు కుమార్ రాజు కీలక ప్రతిపాదన చేసారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు కూటమిలో చర్చగా మారుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో రుషికొండ పైన భవనాలు నిర్మించారు. వీటి నిర్మాణం సమయంలో వివాదాలు మొదలయ్యాయి. అయినా.. నాటి వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసింది. విశాఖ రాజధానిగా ప్రతిపాదించిన జగన్.. అక్కడ ఈ భవనాల వినియోగం పైన తన ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి వినియోగం పైన చర్చలు జరిగాయి. అనేక ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. ఈ భవనాల ను సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ సందర్శించారు. అక్కడ విలాసవంతంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

BJP Leader Vishnu Kumar Raju crucial proposal for usage of Rushi Konda Buuldings

ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్మాణాల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రుషికొండ భవనాల నిర్మాణాలకు బిల్లులు చెల్లింపు అంశం వివాదాస్పదమైంది. ఇక, ఇప్పుడు తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కీలక ప్రతిపాదన చేసారు. ఈ భవనాలను విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం వినియోగించాలని సూచించారు. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైకోర్టు బెంచ్ కోసం జిల్లా అధికారులు కొన్ని భవనాలను పరిశీలన చేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్నూలులో బెంచ్ ఏర్పాటు పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలోనే విశాఖ కేంద్రంగా హైకోర్టు బెంచ్.. అందునా రుషికొండ భవనాల్లో ఏర్పాటు పైన విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఆసక్తి కర చర్చగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+