ఇక చంద్రబాబుకో దండం: అమిత్ షా, మోడీ వ్యూహం ఇదీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బిజెపి సంబంధాలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి బిజెపి సిద్ధంగా లేదనే వార్తలకు మధ్య మధ్యలో బలం చేకూరుతూ వస్తోంది. ఈ నెల 5వ తేదీన చర్చలకు రావాల్సిందిగా బిజెపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, బిజెపి వ్యూహం ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో బిజెపి అగ్రనాయకత్వం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా చంద్రబాబుకు కళ్లెం వేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని వినికిడి.

చంద్రబాబుపై ఆగ్రహానికి కారణం

చంద్రబాబుపై ఆగ్రహానికి కారణం

చంద్రబాబు వ్యవహార శైలి పట్ల మోడీ, అమిత్ షా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటి విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రాన్ని టార్గెట్ చేసే వ్యూహాన్ని అనుసరించి, తాను గట్టెక్కే విధంగా చూసుకున్నారనేది వారి ఆగ్రహానికి మొదటి కారణంగా చెబుతున్నారు.

Recommended Video

    Chandrababu Naidu Angry On Arun Jaitley
    పవన్ కల్యాణ్ తీరు కూడా...

    పవన్ కల్యాణ్ తీరు కూడా...

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రాన్ని లక్ష్యం చేసుకని విమర్శలు చేయడానికి కూడా చంద్రబాబే కారణమని బిజెపి నాయకత్వం భావిస్తోంది. పవన్ కల్యాణ్ జెఎఫ్‌సీ తీరుపై బిజెపి అసంతృప్తితో ఉంది. చంద్రబాబు వెనక ఉండి పవన్ కల్యాణ్‌ను నడిపిస్తున్నారనే అనుమానాలున్నాయి.

     చంద్రబాబు పెచ్చరికలు, అసంతృప్తులు

    చంద్రబాబు పెచ్చరికలు, అసంతృప్తులు

    చంద్రబాబు మాటల తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం పలుచనయ్యే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపైకి గురి పెట్టే విధంగా ఆయన ాట్లాడుతున్నారని అంటున్నారు. రాష్ట్రం విషయంలో జరిగే అభివృద్ధికి తాను కారణమైనట్లుగా, వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం కారణమైనట్లుగా చూపించడంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బిజెపి భావిస్తోంది.

    బాబు కన్నా ముందే...

    బాబు కన్నా ముందే...

    పొత్తు విషయంలో చంద్రబాబు కన్నా తామే ముందు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో అమిత్ షా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ ఇద్దరు మంత్రులను బయటకు రావాలని చెప్పి, తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతను మంత్రి కామినేని శ్రీనివాస రావుకు అప్పగించినట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు కొంత అనుకూలంగా వ్యవహరించే కామనేని ద్వారా ఆ ప్రకటన చేయించడం ద్వారా చంద్రబాబుపై ఆధిక్యత చాటుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.

     ఇంతకు ముందులా కాకుండా...

    ఇంతకు ముందులా కాకుండా...

    చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల ద్వారానే అమిత్ షా ఆపరేషన్ ప్రారంభించారని అంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న హరిబాబుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదనలను తిప్పికొట్టే బాధ్యతను అప్పగించడం మొదటి దశ కాగా, మంత్రి వర్గం నుంచి తప్పుకునే బాధ్యతను కామినేని శ్రీనివాస రావుకు అప్పగించడం రెండో దశగా చెబుతున్నారు.

     అందుకే వారంతా సైలెంట్....

    అందుకే వారంతా సైలెంట్....

    బిజెపిలో ఒక సామాజిక వర్గం చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని దెబ్బ కొట్టడం బిజెపి వ్యూహంలో భాగమని అంటున్నారు. అందుకే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఆయనను తిప్పికొట్టే బాధ్యతను బిజెపి నాయకత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. అదే విధంగా తీవ్ర విభేదాలు ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని సైలెంట్ చేయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. చంద్రబాబుకు వారెలాగూ వ్యతిరేకమే కాబట్టి విమర్శలు చేస్తారనే అభిప్రాయం కలగకుండా ఉండడానికి చంద్రబాబుకు అనుకూలమైనవారితోనే ఆపరేషన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+