చంద్రబాబు ఆ మాట ఎందుకు అన్నారు: బొత్స, 'సిగ్గులేకుండా చెప్తున్నారు'
పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను వదులుకున్నామని చంద్రబాబు చెప్పడంలో అర్థం ఏమిటని వైసిపి నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను వదులుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడంలో అర్థం ఏమిటని వైసిపి నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు మండిపడ్డారు.
ఏపీలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతికి తాము వ్యతిరేకమని చెప్పారు. ఏపీలో కొత్త తరహా దోపిడీకి తెరలేపారన్నారు. అదే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమని ప్రభుత్వం పైన మండిపడ్డారు.
మళ్లీ చెప్తున్నా, అది అనవసరం: రూ.1900 కోట్లపై బాబుకు ఉండవల్లి షాకింగ్ లెక్క
పోలవరం కోసం హోదాను వదులుకున్నామని చెప్పడం ఏమిటో తెలియాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధం ఏమిటని చంద్రబాబును నిలదీశారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుది అంతా మాటల గారడి అన్నారు.
సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు: జోగి రమేష్

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ వైయస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే అని వైసిపి నేత జోగి రమేష్ అన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు.
పోలవరం కాల్వలు కూడా వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని చెప్పారు. కమీషన్ల కోసం హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. కమీషన్ల వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్‌లకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బ్రోకర్‌గా పని చేస్తున్నారన్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications