'విభజన'పై బొత్స సంచలన వ్యాఖ్య, జగన్ పేరుతో కేంద్రానికి హెచ్చరిక!
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన పైన బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సాంకేతికంగా జరగలేదని, రాజకీయ నిర్ణయమని ఆయన విమర్శించారు. విభజన సమయంలో బొత్స కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం గమనార్హం.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ... ఈ నెల 14వ తేదీ నుంచి రైల్వే జోన్ కోసం విశాఖలో దీక్షలు చేపడతామని చెప్పారు. గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు.
అప్పటికీ కేంద్రం విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ పైన స్పందించకుంటే తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్షకు దిగుతారని కేంద్రానికి బొత్స హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర సమస్య అన్నారు.

ప్రివిలేజ్ కమిటీ ముందుకు రోజా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా బుధవారం మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల పైన ఆమె ప్రివిలేజ్ ఎదుట వివరణ ఇవ్వనున్నారు.
ఆమె క్షమాపణ చెబుతారా అనే చర్చ సాగుతోంది. అయితే ఆమె క్షమాపణ చెప్పే అవకాశం లేదని అంటున్నారు. క్షమాపణ చెప్పకుంటే అధికార పార్టీ కూడా కఠినంగానే వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. అమె పైన ఏడాది పాటు సస్పెన్షన్ అలాగే ఉంచడం లేదా పొడిగించడం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.












Click it and Unblock the Notifications