బీటెక్ చదివి జల్సాలు: అన్నం పెట్టిన సంస్థకే కన్నం, పట్టించిన కెమెరా
విశాఖపట్నె: యువత చెడు వ్యసనాలకు అలవాటు పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఓ సంఘటన ఇది. బీటెక్ చదివిన కుర్రాడు... కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఓ జ్యూవెలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ, వ్యసనాలకు అలవాటు పడి, సంపాదన చాలక అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేశాడు.
ఫలితంగా ఆ యువకుడిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 350 గ్రాముల బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ టీ.రవికుమార్ మూర్తి ఈ కేసు వివరాలను వెల్లిడించారు.

బీటెక్ చదివి జల్సాలు: అన్నం పెట్టిన సంస్థకే కన్నం, పట్టించిన కెమెరా
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామానికి చెందిన జంగంరెడ్డి గారి కుమార్ రెడ్డి బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయే పెంచి పెద్ద చేశాడు. చదువు పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరి 21న విశాఖలోని తనిష్క్ జ్యూయలరీ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు.

బీటెక్ చదివి జల్సాలు: అన్నం పెట్టిన సంస్థకే కన్నం, పట్టించిన కెమెరా
బాబాయికి దూరంగా ఉండటంతో మంచిచెడులు చెప్పేవారు లేక కుమార్ రెడ్డి వ్యసనాలకు బాసిసయ్యాడు. ఆదాయం చాలకపోవడంతో పనిచేస్తున్న సంస్ధకు కన్నం వేయడానికి తెగించాడు. ఈ మేరకు గత నెల 26 షోరూం సిబ్బంది అంతా సమావేశంలో ఉండగా, పక్క గదిలో సొరుగు తెరిచి రూ. 3.50 లక్షల విలువ గల 350 గ్రాముల బంగారు బిస్కట్లు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.

బీటెక్ చదివి జల్సాలు: అన్నం పెట్టిన సంస్థకే కన్నం, పట్టించిన కెమెరా
ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న సంస్ధ సిబ్బంది త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం ద్వారకా బస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు.

బీటెక్ చదివి జల్సాలు: అన్నం పెట్టిన సంస్థకే కన్నం, పట్టించిన కెమెరా
ఈ సందర్భంగా డీసీపీ టి.రవికుమార్ మూర్తి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియకుండా అపరిచిత వ్యక్తులను ఉద్యోగంలో పెట్టుకోవద్దని వ్యాపారులకు సూచించారు.












Click it and Unblock the Notifications