జనసేనకు పోటీగా రంగంలోకి టీడీపీ నేత - బల ప్రదర్శన, ఆ సీటు దక్కేదెవరికి..!!
ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీట్ల ఖరారు వేళ ఆశావాహుల తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ వారంలోనే తమ అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దమయ్యాయి. దీని పైన చంద్రబాబు - పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. విజయవాడ నడిబొడ్డున రెండు పార్టీలు ఆశిస్తున్న సీటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
సీట్ల కోసం పోటీ : టీడీపీ, జనసేన మధ్య సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం సీటు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. స్థానికంగా పోతిన మహేష్ ఆ సీటు ఆశిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఒక సీటు ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు పశ్చిమ నేతలు తమకు సీటు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీటు ఆశిస్తూ రంగంలోకి దిగారు. తనకు విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు నిర్వహించారు.

బుద్దా ర్యాలీ : ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారికి బుద్దావెంకన్న వేడుకున్నారు. టీడీపీ కోసం తాను కష్టపడి పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన సేవలను గుర్తించి చంద్రబాబు తనకు సీటు ఇవ్వాలని కోరారు. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా... తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబుతో పాటుగా పవన్ ను కోరుతున్నానని వెల్లడించారు. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలా మంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు.

సీట్లు దక్కేదెవరికి : తొలి నుంచి పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తనకు రెండు స్థానాల్లో ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలని కోరారు. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయమని చెప్పారు. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారి తాట తీస్తానంటూ వ్యాఖ్యానించారు. ప్రాణాలకు తెగించి తాను పని చేస్తున్నానని..సీటు ఇవ్వాలని అభ్యర్దించారు. అయితే, పశ్చిమం సీటుతో పాటుగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కైకలూరు, మచిలీపట్నం పార్లమెంట్ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, సీట్లు ప్రకటన వేళ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications