కాళ్లూ చేతులూ కట్టేసి కృష్ణానదిలో పడేసి చంపారు

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఓ వ్యాపారిని దుండగులు అపహరించి, కాళ్లూ చేతులూ కట్టేసి, కృష్ణానదిలో పడేశారు. దీంతో అతను మరణించాడు. వ్యాపారంలో వివాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత నెల 31వ తేదీన కిడ్నాప్‌ను గురైన వ్యాపారి ఆదివారంనాడు కృష్ణా నదిలో శవమై తేలాడు.

ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు ెచంిదన కిశోర్ బాబు (48)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఖమ్మంలోని పొట్టిశ్రీరాములు రోడ్డులో ఇండూరు రాము అనే వ్యక్తితో కలిసి పురుగుల మందు, విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. గత నెల 31వ తేదీ ఉదయం పది గంటల ప్రాంతంలో కిషోర్ బాబు ఇంట్లో భార్య ఉషకు చెప్పి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు.

Business man killed in Vijayawada

గంటలో వస్తానని చెప్పిన కిశోర్ ఎంత సేపటికీ రాకపోవడంతో కుమారుడు వినయ్ తండ్రి కోసం గాలించాడు. కిశోర్ ద్విచక్రవాహనం మాత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమీపంలో కనపించిది. అదే రోజు సాయంత్రం వినయ్‌కు తండ్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను కిడ్నాప్ చేశారని, విజయవాడకు తీసుకుని వెళ్తున్నారని, తనను కృష్ణానదిలో పడేయాలని అనుకుంటున్నారని కిశోర్ కుమారుడికి ఫోన్‌లో చెప్పాడు.

దాంతో వినయ్ తల్లితో కలిసి ఖమ్మం మూడో పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా, కృష్ణానదిలో ఓ వ్యక్తి శవం తేలియాడుతూ కనపించింది. స్థానికులు అందించిన సమాచారంతో స్థానిక పోలీసులతో పాటు ఖమ్మం పోలీసులు, కిశోర్ బాబు బంధువులు అక్కడికి వెళ్లారు. ఆ శవాన్ని కిశోర్ బాబుదిగా గుర్తించారు.

కిశోర్ బాబు బజారులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుకుందామని తీసుకుని వెళ్లాడు. అతనితో పాటు మరికొందరు కిశోర్ బాబును కిడ్నాప్ చేసి, అతని కాళ్లను, చేతులనూ కట్టేసి కారులో వేసుకుని విజయవాడకు బయలుదేరారు. నగరంలో పోలీసులు తనిఖీలు జరుగుతుండడంతో వాహనాన్ని కనకమ్మ గుడి వద్ద ఆపారు. కిడ్నాపర్లు కారులో నుంచి దిగి పక్కకు వెళ్లారు. దీంతో కిశోర్ బాబు తన ఫోన్ నుంచి కుమారుడికి ఫోన్ చేశాడు. వ్యాపారంలోని గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+