మెదక్ ఎంపిసీటుకి నోటిఫికేషన్: ఆళ్లగడ్డను మర్చిన ఈసి

ఆగస్టు 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 13న పోలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 16న కౌంటింగ్ నిర్వహిస్తారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికీ పోటీ చేసిన కెసిఆర్ అక్కడ్నుంచి గెలిచి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డను విస్మరించింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఎన్నికలను యథావిధిగా నిర్వహించగా ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఆ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉన్నా ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications