ఆ ముగ్గుర్ని రాయలసీమ ప్రజలు తరిమికొడ్తారు: బైరెడ్డి

Byreddy Rajasekhar Reddy
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వీరిని రాయలసీమ ప్రజలు తరిమికొడతారని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్న అంశంపై నాయకులు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.

ఈ ముగ్గురు నాయకులకు రాయలసీమ గురించి గానీ, శ్రీబాగ్ ఒప్పందం గురించి గానీ ఏమి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం వీరు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుంచే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని గుర్తు చేశారు. 1956 వరకు ఇక్కడే రాజధాని ఉందన్న అంశం కూడా వీళ్లకు తెలియదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+