10 రోజుల్లో అసెంబ్లీకి టి నోట్: ఆర్టికల్ 3ప్రకారమే విభజన
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై కేబినెట్ నోట్ పది రోజుల్లో అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో తెలంగాణ నోట్ పై వాడిగావేడిగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి నోట్‌ను పంపించే అవకాశాలున్నాయి.
తెలంగాణ నోట్ పైన అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే జరిగి, ఓటింగ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో మంత్రులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు నోట్‌ను వ్యతిరేకించారు. గంటన్నరపాటు హాట్ హాట్‌గా చర్చ సాగింది. అనంతరం నోట్‌ను ఆమోదించింది.

పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్రం
తెలంగాణ నోట్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. అన్ని ప్రాంతాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్ర పోలీసు శాఖకు సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) ప్రసాద రావు జిల్లాలకు చెందిన ఎస్పీలు, ఐజిలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు.
కేబినెట్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఉద్రిక్తలకు దారి తీసినా సంయమనం పాటించాలని, ఎవరిని రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు ఐక్యకార్యాచరణ సమితి నాయకులతో, రాజకీయ నాయకులతో మాట్లాడాలని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి భద్రత దళాలు తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
72 గంటల బంద్
తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా కడప జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక 72 గంటల జిల్లా బందుకు పిలుపునిచ్చింది. కడపలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను ఐకాస నేతలు మూసివేయించారు. నోట్‌ను నిరసిస్తూ కృష్ణా జిల్లాలో శుక్రవారం బందుకు పిలుపునిచ్చారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications