'ఆదర్శ' జంషెడ్‌పూర్: ఎపికి 25వేల ఎకరాల భూమి

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, గుంటూరు... ఇలా పలు ప్రాంతాలను రాజధాని కోసం పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలనేది సెప్టెంబరు నెలలోగా తేల్చుతామని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రెండు రోజుల క్రితం చెప్పారు.
కాగా, ఎపి రాజధాని కోసం ప్రత్యేక కమిటీ ప్రధానంగా పంజాబ్ - హర్యానాల రాజధాని అయిన చండీగఢ్, ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్, గుజరాత్ రాజధాని అయిన గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాజధాని అయిన రాయ్‌పూర్‌లను పరిశీలించవచ్చునని సూచించింది.
చండీగఢ్.. పంజాబ్ - హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. మహారాష్ట్ర నుండి విడిపోయాక గుజరాత్‌లో అహ్మదాబాద్ నగరం సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నా... దానిని కాదని గాంధీ నగర్‌లో రాజధానిని ఏర్పాటు చేశారు. అయిదేళ్లలో దీని నిర్మాణం జరిగింది. 2000 ఛత్తీస్‌గడ్ ఏర్పడింది.
రాయ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయా రాయపూర్ పేరిట రాజధాని నిర్మాణం జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి బ్రిటీష్ హయాంలో కటక్ రాజధానిగా ఉండేది. 1948లో భువనేశ్వర్‌ను రాజధానిగా చేశారు. ఇక జంషెడ్ పూర్ ప్రణాళికబద్దంగా నిర్మించిన నగరం. దీనిని మన రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ప్రాతిపదికగా తీసుకోవాలని కమిటీ సూచించింది.
కాగా, ఎపిలో ఆదర్శవంతమైన రాజధాని నిర్మాణం కోసం 25వేల ఎకరాల భూమి కావాలని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. పూర్తిస్థాయి ప్రణాళిక బృందాన్ని నియమించాలని, అందులో నిపుణులైన సివిల్ ఇంజనీర్లు ఉండాలని పేర్కొంది. రాజదానికి అవసరమైన భవన నిర్మాణాలతో పాటు చక్కటి రవాణా వసతులు, రహదారుల నిర్మాణం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటివి ప్రణాళికా బద్ధంగా జరగాలని పేర్కొంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications