పాంచ్: విలాసాలు, విదేశీ చదువుల కోసం కారు చోరీ
హైదరాబాద్: విదేశీ చదువుల కోసం దొంగతనానికి పాల్పడిన ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. సికింద్రాబాదులోని ఆల్వాల్ పోలీసులు వారిని పట్టుకున్నారు. వివరాలను ఆల్వాల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ మీడియాకు అందించారు.
ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆల్వాల్‌లోని వెంకటాపురంలో నివసించే గుజ్జల వెంకటరాంరెడ్డి కారు ఈ నెల 17వ తేదీన చోరీకి గురైంది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు సాగించారు.
ఆల్వాల్ పోలీసులు దమ్మాయిగుడాలోని ఓ అపార్టుమెంట్ వద్ద ఆ కారును పట్టుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తును కొనసాగించి నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు యువకులు ఆ కారును దొంగిలించినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు.

కాప్రాలోని జెజె కాలనీకి చెందిన వడ్డమాని మనోజ్ కుమార్ (21), వడ్లమాని వెంకటసాయి వినయ్ కుమార్ (24), వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి. సంతోష్ (20), తాళ్ల ప్రేమ్ కుమార్ (20) బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగుడాలో నివసించే ధర్మతేజ (21)తో పరిచయమైంది. ఐదుగురు కూడా కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరమవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
తమ పథకంలో భాగంగా ఆ ఐదుగురు వెంకటాపురంలోని వెంకట్రామి రెడ్డి కారును దొంగిలించారు. దాన్ని దమ్మాయిగూడాలోని ఆపార్టుమెంటు వద్ద అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications