జగన్‌పై కేసు నమోదు: సుప్రీంకు రెడీ.. అంబటి, వివరణ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదయింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శంకర్ గౌడ్ అనే న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అక్టోబర్ 26వ తేదిన హైదరాబాదులో జరిగిన సమైక్య శంఖారావంలో జాతీయ గీతం జనగణమనను సరిగా పాడలేదని ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేయాలని సరూర్ నగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

అంబటి వివరణ
సభాపతి నాదెండ్ల మనోహర్ పైన తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వివాదాస్పదం చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. స్పీకర్ వంటి అత్యున్నత వ్యక్తి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తలొగ్గి అసెంబ్లీ నడిపిస్తున్నారని ఆరోపించారు.
గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అవలంభిస్తున్న విధానం ఏమిటి? ఇప్పుడు అవలంభిస్తున్న విధానం ఏమిటని, ఆ మాత్రం బుద్ధి లేదా అని మాత్రమే జగన్ ప్రశ్నించారన్నారు. సభాపతి స్థానాన్ని కించపర్చాలన్నది తమ అధినేత ఉద్దేశ్యం కాదన్నారు. గతంలో కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికలను ఆపలేదా అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టులో కూడా అఫిడవిట్లు దాఖలు చేస్తామన్నారు. సోనియా గేమ్ ప్లాన్‌లో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రపతికి కెసిఆర్ చెప్పిందే చంద్రబాబు చెప్పారని, అందుకే ఒక్కడే వెళ్లారన్నారు.












Click it and Unblock the Notifications