నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపికి ఝలక్, గెలిపించిన ప్రజలపై..: ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌పై కేసు

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి షాక్! ఆయన పైన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. వావిలేటిపాడు ప్రాంతంలో రూ.2 కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసినట్లు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేశారు.

కాకాని సర్వేపల్లి ఎమ్మెల్యేతో పాటు వైసిపి జిల్లా అధ్యక్షులు కూడా. ఆయన పేదల పేదల స్థలం కబ్జా కేసులో చిక్కుకున్నారు. నియోజకవర్గ పరిధిలో దౌర్జన్యం చేస్తూ పేదలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నట్లు బాధితులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం.

గతంలో, నెల్లూరు పట్టణ పరిధిలోని ధనలక్ష్మీపురం ఎంకే నగర్‌లోని డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్లో ఉన్న తొమ్మిది ప్లాట్లను ఆక్రమించి కంచె వేసుకున్నారని, దీంతో బాధితులు భూములను అప్పగించాలని తిరిగితే బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో నకిలీ మద్యం సరఫరా చేసిన మాఫియాతో లింకులు ఉన్నాయంటూ సీఐడీ ఇటీవల ఛార్జీషీట్ దాఖలు చేసింది. సీఐడీ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. తాజాగా, నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్‌లో సెక్షన్లు 427, 447 కింద కబ్జా కేసు నమోదు చేశారు.

English summary
Case against YSRCP MLA Kakani Govardhan Reddy in Nellore Rural police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X