బాబు కోటలో నాకూ: జగన్ హ్యాపీ, వెంట రోజా (పిక్చర్స్)
చిత్తూరు: రాష్ట్ర విభజనకు అడ్డుచెబితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తమను కేసుల్లో ఇరికిస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. విభజనకు సహకరిస్తున్న కిరణ్, బాబుల కాలర్ పట్టుకొని మీ ఉద్యోగాల గురించి అడగండని యువతకు సూచించారు.
విభజన జరిగితే రాష్ట్రం ఎడారి అవుతుందని తెలిసినా సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కుమారుడి కోసం ఆమె మన చెల్లెళ్లు, తమ్ముళ్ల గొంతు కోస్తుంటే చంద్రబాబు, కిరణ్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండో రోజైన ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం; పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండలాల్లో జగన్ పర్యటించి ప్రసంగించారు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడం కుప్పం నుంచే ఆరంభం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు ప్రతి దశలోనూ సిఎం సహకరిస్తున్నారని, రాష్ట్ర అధికారులను ఢిల్లీకి పంపి విభజనకు అనువుగా నివేదికలు ఇప్పిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా, విభజనకు ముందే సమైక్య తీర్మానం చేద్దామన్నా కిరణ్ నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు.

జగన్ 1
సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని తాము కోరుతుంటే, ఆ పని చేయకుండా ప్రజలకు అర్థంకాని భాషలో చంద్రబాబు మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు.

జగన్ 2
ముఖ్యమంత్రి, చంద్రబాబు పోటీపడి సమైక్య డ్రామాలు బాగా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన ప్రక్రియ ఆరంభమైన వెంటనే హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఆస్తుల విలువ సగానికి పడిపోయిందని, ఈ నష్టాన్ని సోనియా పూడుస్తారా? కిరణ్, చంద్రబాబు పూడుస్తారా? అని ప్రశ్నించారు.

జగన్ 3
రాష్ట్రం కలిసుండగానే కృష్ణా, గోదావరి జలాలపై హక్కును కోల్పోతున్నామని, ఇక విడిపోతే రెండు ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయన్నారు.

జగన్ 4
ఆదివారం శాంతిపురం గ్రామంలో వైయస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్ ఉపాధ్యడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలన్న ఉద్దేశంతోనే సోనియా తెలుగు ప్రజలను రెండుగా విభజిస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్ 5
అరవై సంవత్సరాలుగా కలసి వున్న తెలుగువారిని విడగొట్టే అధికారం సోనియాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఓట్లు సీట్లు కోసమే రాష్ట్ర విభజనను తెరపైకి తీసుకొచ్చారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని తెలుస్తోందన్నారు.

జగన్ 6
తెలుగుదేశం కంచుకోట కుప్పంలో తన సభకు భారీగా జనం తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణాలైనా అర్పిస్తానని జగన్ హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

జగన్ 7
సమైక్యం కోసం తాను లేఖ ఇచ్చినట్లే చంద్రబాబు, కిరణ్‌లు లేఖ ఇవ్వకుండా ఎందుకు డ్రామలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి శూన్యమే కాకుండా ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.

జగన్ 8
చివరకు తాగునీటికి సైతం కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంపై ఆదారపడాల్సి వస్తుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 30 పార్లమెంట్ స్థానాలు గెలుపొంది ఢిల్లీ కోటలు బద్దలు కొడతామన్నారు.

జగన్ 9
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిపోయి ప్యాకేజీలను అడగడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక లోని ఆల్‌మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప రాష్ట్రానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నేడు ఏర్పడిందని ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త రాష్ట్రం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని జగన్ అన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications