ప్రజాధనం కొల్లగొట్టాడు: సీబీఐ తీవ్రవ్యాఖ్య, జగన్ విదేశీ టూర్‌కు ఓకే

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ సాకు చూపిస్తూ కేసును సాగదీస్తున్నారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం ఆరోపించింది. తాను జూన్ లేదా జూలై నెలలో జెరూసలేం వెళ్తానని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తన వీసా కోసం తన పాస్‌పోర్టును అప్పగించాలని జగన్ అందులో విజ్ఞప్తి చేశారు. జగన్ పిటిషన్ పైన సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ కేసు అభియోగాలకు నమోదుకు ముందు వాదనల స్థాయిలో ఉందన్నారు. జగన్ ఏదో ఒక సాకు చూపుతూ సాగదీస్తున్నారని పేర్కొన్నారు.

CBI objects to YS Jagan petition

జగన్ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి సంపన్నుడయ్యాడని తీవ్ర ఆరోపణ చేసింది. కేసులో డిశ్చార్జి పిటిషన్ వేస్తారో లేదా నిర్ణయించుకోవాలని చెప్పింది. జగన్ తన పలుకుబడిని దృష్టిలో ఉంచుకొని కోర్టు గతంలో షరతులు విధించిందని సీబీఐ చెప్పింది. తాను జెరూసలేం వెళ్తానని, అందుకు అనుమతివ్వాలని, పాస్‌పోర్టు ఇప్పించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన బుధవారం విచారణ జరిగింది.

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది. వాదనల అనంతరం... జగన్ జెరూసలేం, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. జూన్, జూలై నెలల్లో 15 రోజులు వెళ్లవచ్చు. ఫోన్, ఫ్యాక్స్ నెంబర్లు కోర్టు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+