పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపు - ఏం జరిగింది..!!

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు సాంకేతిక ఆధారాల ను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్‌ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్‌ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు. ఆ తరువాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు నిర్దారణకు వచ్చారు.

కీలక ఆధారాలు
పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. అదేరోజు మధ్యాహ్నం కోదాడ లో రూ.650తో మద్యం కొనుగోలు చేసి, ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. సరిగ్గా కంచిక ర్ల-పరిటాల మధ్య అదుపుతప్పి పడిపోవడంతో బుల్లెట్‌ హెడ్‌లైట్‌ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్‌ వంగిపోయాయి. ప్రవీణ్‌ చేతులకు గాయాలయినట్లు తెలుస్తోంది. గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్‌ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్‌లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంక్‌కు రాగానే ఎంత పెట్రోల్‌ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్‌ ఎనిమిది వేళ్లు చూపించారు.

CC tv Footage becomes crucial in Pastor Praveen case investigation

పార్కులో మూడు గంటలు
అక్కడ రూ .872 ఫోన్‌ పే చేశారు. అప్పటికే ప్రవీణ్‌ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్‌ బంక్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు.
ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్‌కు చేరుకున్నారు. ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్‌ బుల్లెట్‌పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రామవ ప్పాడు రింగ్‌కు పది మీటర్ల దూరంలోనే వోక్స్‌ వ్యాగన్‌ షోరూమ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్‌పై నుంచి ఆయన పడిపోయారు. ప్రవీణ్‌ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రెయిలింగ్‌ వద్ద కూర్చోబెట్టారు. ఆ తర్వాత బూత్‌ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్‌ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఇన్నోటెల్‌ హోటల్‌ పక్కన ఉన్న టీస్టాల్‌ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్‌ బుల్లెట్‌పై ఏలూరు వైపు బయల్దేరారు.

సీసీ కెమేరాల్లో
ట్రాఫిక్‌ ఎస్‌ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్‌ ఎస్‌ఐతో కలిసి పాస్టర్‌ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్‌ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సుమారు 200 కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్‌ బైక్‌ పాక్షికంగా దెబ్బతి నట్లు గుర్తించారు. సీసీ కెమేరాల్లో గుర్తించిన ఫుటేజ్ మేరకు 4వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ప్రవీణ్‌ గొల్లపూడిలో పెట్రోలు బంక్‌కు చేరుకున్నారు. 5.13 గంటలకు మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. 5.30 గంటలకు పోలీసులు రామవరప్పాడు రింగ్‌ వద్ద ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు తీసుకొచ్చారు. 5.30- 8.20 గంటల వరకు బూత్‌ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు. రాత్రి 8.47 గంటలకు రామవరప్పాడు రింగ్‌ నుంచి ఏలూరు వైపు వెళ్లారు. దీంతో, ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+