Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ, తెలంగాణా విభజన పంచాయితీ: సెప్టెంబర్ 27న కేంద్ర హోంశాఖ కీలకభేటీ.. ఈసారైనా తేలుస్తారా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన సందర్భంలో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 27న న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఏపీ, తెలంగాణా విభజన సమస్యలపై కీలక భేటీ .. అజెండా పంపిన కేంద్రం

ఏపీ, తెలంగాణా విభజన సమస్యలపై కీలక భేటీ .. అజెండా పంపిన కేంద్రం

14 అంశాలతో సమావేశానికి సంబంధించిన అజెండాను రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, ఆహారం, విద్య, వ్యవసాయం, పెట్రోలియం, ఆరోగ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు, రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు హోం శాఖ తదితర మంత్రిత్వ శాఖలకు పంపింది. ద్వైపాక్షిక మరియు ఇతర అంశాలపై సమావేశం, ప్రధాన చర్చల అజెండాగా పేర్కొంది. దీనికి తగినట్టుగా అన్నీ శాఖల నుండి పూర్తి సమాచారంతో రావాలని కేంద్రం పేర్కొంది.

షెడ్యూల్ 9, 10 లలో ఉన్న సంస్థల విభజన సమస్యలపై చర్చ

షెడ్యూల్ 9, 10 లలో ఉన్న సంస్థల విభజన సమస్యలపై చర్చ


ద్వైపాక్షిక విభాగంలో, ఈ సమావేశంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల విభజనకు సంబంధించి చర్చించనున్నారు. షెడ్యూల్ 10 లోని రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన సమస్యలపై చర్చించనున్నారు.

ఉమ్మడి సంస్థల్లో నగదు నిల్వలు.. అప్పుల పంపిణీపై చర్చ

ఉమ్మడి సంస్థల్లో నగదు నిల్వలు.. అప్పుల పంపిణీపై చర్చ

ఉమ్మడి సంస్థల్లో వివిధ కేంద్ర ప్రయోజన పథకాలకు బ్యాంకుల్లోని నగదు నిల్వల విభజన, విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన, బియ్యం సబ్సిడీకి సంబంధించి తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌరసరఫరాల సంస్థకు నగదు క్రెడిట్ విడుదల తదితర సమస్యలను అజెండాలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి నిధులపై కూడా సమావేశంలో చర్చిస్తారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రస్తావన లేదని నోట్ పేర్కొంది.

ఇతరత్రా సమస్యలపైనా చర్చ... విభజన పంచాయితీ తేలుతుందా?

ఇతరత్రా సమస్యలపైనా చర్చ... విభజన పంచాయితీ తేలుతుందా?


ఇక ఇతరత్రా సమస్యలను చూస్తే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవిన్యూ లోటు, పన్నుల సమస్యలు, విద్యా సంస్థల ఏర్పాటు, రాజధానికి ర్యాపిడ్ రైలు కనెక్టివిటీపై కూడా చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన నాటి నుండి ఆస్తుల పంపకాలలో అనేక సందర్భాలలో భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27వ తేదీన జరగనున్న కీలక భేటీ ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరిస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+