కుప్పంలో మారుతున్న సమీకరణాలు - చంద్రబాబు మరోసారి..!!
టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పంలో సమీకరణాలు మారుతున్నాయి. ఎలాగైనా కుప్పంలో ఈ సారి గెలవాలని తొలి నుంచి సీఎం జగన్ లక్ష్యంగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గ సమీక్షలను కుప్పం నుంచే ప్రారంభించారు. కుప్పంలో నేతలు..కార్యకర్తలు కోరిన విధంగా నిధులు మంజూరు చేసారు. కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ -స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఏకపక్షం గా విజయం సాధించింది. దీంతో..ప్రతీ సమావేశంలోనూ ఈ ఫలితాలనే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు.

కుప్పం పై జగన్ వర్సెస్ చంద్రబాబు
వైసీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ భరత్ ను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని.. భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం వెల్లడించారు. ఇక, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం ను రెవిన్యూ డివిజన్ గా చేయలేకపోయారనేది ముఖ్యమంత్రి జగన్ మరో విమర్శ. తన హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయాలంటూ చంద్రబాబు లేఖ రాయగా.. తాను కుప్పంను రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేసానని చెప్పుకొచ్చారు.
ఇక, తన దెబ్బకే చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు. దీంతో..గతం కంటే ఎక్కువగా చంద్రబాబు ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు.

చంద్రబాబు ప్రత్యేక ఫోకస్
గతంలో పూర్తిగా అనుచరులు.. స్థానిక పార్టీ నేతలకే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన చంద్రబాబు...ఇప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కుప్పంను నిధుల మంజూరు తరువాత చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు.
తొలి రోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో కీలకమైన రామకుప్పం మండలంలో పర్యటించనున్నారు. రోడ్ షో ల్లో పాల్గొంటారు. తాజాగా.. సీఎం జగన్ కుప్పం సమీక్షలో చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న నిర్ణయాల పైన చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. రెండో రోజు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు..అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

జగన తొలి లక్ష్యంగా మారిన కుప్పం
మూడో రోజు కుప్పం..గుడుపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో వచ్చే ఎన్నికల కోసం అనుసరించాల్సిన రూట్ మ్యాప్ ను చంద్రబాబు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ సైతం కుప్పం బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించింది. దీంతో.. తరచూ కుప్పం కు సంబంధించిన అధికారిక - పార్టీ వ్యవహారాల్లో ఆయన అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, నియోజకవర్గంలో తాజాగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ సారి చంద్రబాబు కుప్పం పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications