వివాదాస్పదం : ఎన్ ఐఆర్ లు సామాజిక కోణాన్ని విస్మరిస్తున్నారు
ఎన్ ఆర్ ఐలు స్వదేశాన్ని విస్మరించకుండా సేవలు అందించాలని కోరారు.అమ్మను , ఆంద్రప్రదేశ్ ను మరిచిపోకూడదని బాబు ఎన్ ఆర్ ఐ లను కోరారు. ఈ మేరకు స్వదేశ అభివృద్దిలో పాలుపంచుకోవాలని కోరారు బాబు.
తిరుపతి :విదేశాల్లో వ్యవస్థల వల్ల నిబద్దతతో ఉండే ఎన్ ఆర్ ఐలు, స్వదేశానికి రాగానే సామాజిక కోణాన్ని విస్మరిస్తున్నారని ఆంద్రప్రదేశ్ ముక్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమిని విస్మరించకుండా సేవలు అందించాలని కోరారు.
ఎన్ ఆర్ ఐ లు తమ స్వంత దేశంతో పాటు, తమ స్వంత ఊరు అభివృద్దిలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆయన ఆదివారం నాడు విలేకర్లతో మాట్లాడారు.విదేశాల్లో వ్యవస్థలు పటిష్టంగా ఉన్నందునే ఇబ్బందుల
దేశం కోసం ఎన్ ఆర్ ఐలు సేవ చేస్తే తమ స్వంత దేశాలు కూడ అభివృద్దికి తోడ్పాటు అందించినవారు అవుతారని బాబు చెప్పారు.దేశంలో వ్యవస్థలను బాగుపడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు బాబు.
అమ్మను, ఆంద్రప్రదేశ్ ను ఎవరూ కూడ మరిచిపోకూడదని ఆయన కోరారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ది కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ మేరకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నట్టు చెప్పారు.

పశువులకు హస్టళ్ళు కట్టిస్తాం
విధ్యార్థులకు హస్టళ్ళు ఉన్నట్టుగానే పశువులకు కూడ హస్టళ్ళను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.పశువులకు హస్టళ్ళను కట్టించడాన్ని నారావారిపల్లె నుండే ప్రారంభించనున్నట్టు బాబు చెప్పారు. రాష్ట్ర అభివృద్ది కోసం ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తే వాటికే ప్రాధాన్యతను ఇస్తానని బాబు చెప్పారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

మనసు కేంద్రీకరించి పనిచేస్తేనే ఫలితాలు
గతంలో ఎక్కువ పనిచేస్తేనే ఫలితాలు ఎక్కువ వస్తాయని భావించి అధికారులను పరుగులు పెట్టించా, అయితే దాని వల్ల పలితాలు రావని అర్థమైందని బాబు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత అధికారులను పరుగులు పెట్టించే బదులుగా, అధికారులు మనుసు పెట్టి ఈ పనులను చేసేలా కృషి చేసేలా ప్రయత్నిస్తున్నానని బాబు చెప్పారు. నచ్చిన పనిని ఆనందంగా పనిచేయాలని కొరుతున్నట్టు చెప్పారు బాబు.

కన్సల్టెంట్లను నియమించండి
రాజధాని నిర్మాణం, అభివృద్ది కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకొనేందుకుగాను అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ వ్యవహరాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఆర్ డి ఏ ఎడిసి విభాగాలకు అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించుకోవాలని బాబు సూచించారు.

సంక్రాంతి సంబరాల్లో బాబు బిజీ బిజీ
నారావారిపల్లెలో బాబు సంక్రాంతి సంబరాల్లో బిజీ బిజీగా గడిపారు. సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి, తమ్ముడి కొడుకు రోహిత్ , ఇతర కుటుంబసభ్యులతో కలిసి నాగాలమ్మకు బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎన్ టి ఆర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు.పండుగ సందర్బంగా గ్రామస్థులతో కలిసి చర్చించారు.

థావోస్ కు బయలుదేరిన బాబు
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తెల్లవారుజామున థావోస్ పర్యటనకు వెళ్ళాడు.సోమవారం నాడు స్విస్ ఇండియా చాంబర్ ప్రతినిథధులతో ఆయన ధ్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 17 నుండి 20వ, తేది వరకు ప్రపంచ స్థాయి ఆర్థిక సదస్సులో బాబు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications