దేవుడు అవకాశమిచ్చాడు, భయపడను: ఆదిలక్ష్మికి తొలి ప్లాట్
అమరావతి: సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని, తాను ఎవరికీ భయయపడబోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తుళ్లూరు నుంచి శ్రీకారం చుట్టారు.
లాటరీ పద్ధతిలో ఆయన ప్లాట్లను కేటాయించారు. తొలి ప్లాటును నేలపాడుకు చెందిన మహిళా రైతు కొమ్మినేని ఆదిలక్ష్మికి ఇచ్చారు. ప్లాట్లు పంపిణీ చేస్తున్న ఈ రోజు చరిత్రలో మిగిలి పోయే రోజని, నేలపాడు వాసులకి ప్లాట్లు పంపిణీ చేయడం మొట్టమొదటి ఘట్టమని చంద్రబాబు అన్నారు. రాజధాని ఇక్కడ వస్తుందిని ఎవరూ ఊహించలేదని, కలకూడా కనలేదని అన్నారు.
కాంగ్రెసు నేత జైరాం రమేష్ తన పుస్తకంలో రాసుకున్న విధంగా కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. అలా చేయడం వల్ల ఎంత నష్ట పోయామో కాంగ్రెస్‌వాళ్లు ఇప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు. కట్టుబట్టలతో మాత్రమే కాదు అప్పుతో ఇక్కడకు వచ్చామని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతో పాటు 13 జిల్లాల్లోనూ విభజన సృష్టించాలని కమిటీ వేశారని విమర్శించారు. అందరికీ సమాన దూరంలో ఉండేలా ఆలోచించి రాజధాని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు ముందుకొచ్చి 33వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.
అత్యాధునిక ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. అందుకే ప్రపంచస్థాయిలో అమరావతికి గుర్తింపు వస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అమరావతి నిర్మాణం జరగకూడదని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. భూములు ఇవ్వని వారి నుంచి అక్టోబర్‌లో భూసేకరణ చేస్తామని తెలిపారు.
కాగా, నవ్యాంధ్ర రాజధానిలో పరిపాలన భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయి. వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. ఈనెల 29న సచివాలయం 6వ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభమవుతుందని, వచ్చే నెల 6న 6వ బ్లాక్‌లో ఫస్ట్‌ఫ్లోర్, 5వ ఫ్లోర్ మొదటి అంతస్తు ప్రారంభమవుతాయని తెలిపారు.
వచ్చే నెల 15న మిగిలిన భవనాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనెల 29 నుంచి విడతల వారీగా ఉద్యోగులను తరలిస్తామని, ఇక నుంచి ఇక్కడి నుంచే పరిపాలనా కొనసాగుతుంది సీఎం చంద్రబాబు చెప్పారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications