కాల్ మనీ ఇష్యూపై చంద్రబాబు భగ్గు: వడ్డీ వ్యాపారి వేధింపులకు ఆత్మహత్య, వైన్ షాపులో వ్యక్తి మృతి

విజయవాడ: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. కాల్ మనీ వ్యవహారంలో విస్మయం కలిగించే విషయాలు బయటపడిన విషయం తెలిసిందే.

Chandrababu

వడ్డీ వ్యాపారాల వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. వడ్దీ వ్యాపారుల వేధింపులు తాళలేక గణేష్ అనే పాలవ్యాపారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అతను సూసైడ్ నోట్ రాశాడు.

వడ్డీ వ్యాపారి వద్ద రూ. 18 వడ్డీ చొప్పున లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి అతను ఉరేసుకుని ఇంట్లో మరమించాడు.

ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద ఓ వైన్ షాపులో మద్యం సేవించి ఓ వ్యక్తి మరణించాడు. మద్యం విక్రయించిన సూర్య వైన్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ వ్యక్తి కల్తీ మద్యం వల్ల మరణించాడా, గుండెపోటుతో మరణించాడా అనే విషయం తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+