గ్రేటర్‌లో పరువు నిలుపుకునే ఆరాటం: మూడువైపులా బాబు పోరాటం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండు వైపులా పోరాడుతున్నారు! ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ, మరోవైపు తమకు ధీటుగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పట్ల వ్యూహాత్మక వైఖరితో వెళ్తూ, మరోవైపు తెలంగాణలో టీడీపీని తిరిగి పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.
రాజధాని, ల్యాండ్ పూలింగ్, విదేశీ పర్యటనల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీను దనుమాడుతోంది. దీనికి చంద్రబాబు, మంత్రులు కూడా ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైన ఏమీ చేయడం లేదని వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
క్యాపిటల్‌లో కొత్త ట్విస్ట్
ఏపీ రాజధాని పరిధిలో రెండో పంట అవకాశం లేదని సీఆర్డీఏ కమిషనర్ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో ఎమర్జెన్సీని అమలు చేయాలని చూస్తున్నారా? రాజధాని పరిధిలో మరో చట్టాన్ని అమలు చేయాలని చూస్తే సహించమని చెబుతోంది. రాజధాని పరిధిలో లే అవుట్లకు కూడా ఛాన్స్ లేదని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు.

అయితే, రాజధాని ప్రాంతంలోని రైతులకు ఒకేసారి లక్షన్నర రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తద్వారా రాజధాని పరిధిలోని వారిని ల్యాండ్ పూలింగ్ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.50వేలు మాఫీ అయ్యాయని, మిగిలినవి కూడా ఫిబ్రవరి 5వ తేదీ లోపు చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా కూడా చంద్రబాబును చిక్కుల్లో పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉందని, అయినప్పటికీ ఇప్పటికీ ప్రత్యేక హోదా ఎలాంటి కదలిక లేదని, పైగా అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారని, ఎన్డీయే మిత్రపక్షమైన చంద్రబాబు కూడా ఆ దిశలో ఏం చేయలేకపోతున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకుండా ప్రత్యేక హోదా కష్టమని చెప్పారు. చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ.. మరో పేరుతో నిధులు రాబడతామని మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీతో పోటీ?
2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తాము బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఆ దిశలో ప్రయత్నాలు చేస్తోంది. ఇది మిత్రపక్షమైన టీడీపీకి ఏపీలో చిక్కులు తీసుకు వస్తోందని అంటున్నారు.
బీజేపీకి పవన్ కళ్యాణ్ అండ
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కంటే బీజేపీకే ఫేవర్‌గా ఉంటారని చెప్పవచ్చు. మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. మోడీకి కితాబిచ్చారు. అందరు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీకి మద్దతిచ్చారే తప్ప.. అనే వ్యాఖ్యలు కూడా నాడు వినిపించాయి. పవన్ ద్వారా కూడా ఏపీలో బీజేప ఎదగాలని భావిస్తోంది.
తెలంగాణలో పార్టీ కోసం...
తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా చాలామంది టీడీపీ నేతలు తెరాసలోకి వెళ్లారు. తెలంగాణలో టీడీపీ క్రమంగా బలహీనపడుతున్నదనే చెప్పవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా క్యాడర్ అటు ఇటు అవుతోందని అంటున్నారు.
అయితే, హైదరాబాదులో మాత్రం తెలుగుదేశం పార్టీకే ఇంకా మంచి పట్టు ఉందని అంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు పార్టీ నుండి వెళ్లిపోయినప్పటికీ పార్టీ క్యాడర్ మాత్రం విడిచి వెళ్లలేదని అంటున్నారు. గ్రేటర్‌లో తమకే బలం ఉందని టీడీపీ చెబుతున్నందున.. తిరిగి పరువు నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ముఖ్య నేతలకు గాలం వేస్తున్నారని అంటున్నారు.
ముఖేష్ గౌడ్ వస్తున్నారా?
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ను పార్టీలోకి తీసుకు వస్తున్నారని అంటున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే ఆయన తలసాని పైన పోటీ చేయవచ్చునని అంటున్నారు. ముఖేష్ టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖేష్ చేరిక ద్వారా గ్రేటర్లో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
-
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications