గంజాయి మొక్క: జగన్‌పై బాబు, నాగలితో..(పిక్చర్స్)
కడప: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం కడప మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప అని, ఇలాంటి తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు పుట్టాడని పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. పులివెందుల నేరస్తులకు స్థావరంగా మారిందన్నారు.
తిరుపతి, అనంతరం, కర్నూలు పట్టణాలకు ఆరు వరుసల రహదారులు నిర్మిస్తామన్నారు. కడప జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటి హబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తామని హామి ఇచ్చారు. ఇక్కడ చదువుకున్న వారికి కడపలోనే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానన్నారు. కడప ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ నున్న వనరులతో పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసమేనన్నారు.
తనది, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీది విన్నింగ్ కాంబినేషన్ అని చంద్రబాబు అన్నారు. టిడిపి, బిజెపి పొత్తు కుదిరిన తర్వాత షేర్‌మార్కెట్ అమాంతంగా పెరిగిందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారని, అందుకే రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. సీమాంధ్రలో సైకిల్ స్పీడ్ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని, బిజెపితో పొత్తు కుదిరిన తర్వాత స్పీడ్ తుపానులా మారి ఆ గాలికి ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమన్నారు.
రాయలసీమ, కోస్తాలో గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లే బుల్లెట్ రైలును నడిపిస్తామన్నారు. ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. రైతు రుణాలమాఫీతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ 60 సంవత్సరాలకు పెంచుతామన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు పాటు పడతామన్నారు. ఉద్యోగులకు అవసరమయితే సెంట్రల్ పిఆర్‌సిని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం పసుపు దళంతో పాటు వృద్ధుల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు.

నాగలితో బాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

ప్రజాగర్జనకు హాజరైన జనం
సోమవారం సాయంత్రం కడప మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జనలో చంద్రబాబు మాట్లాడారు.

బాబు ప్రసంగం
ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప, ఇలాంటి తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు పుట్టాడని పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు.

బాబు ప్రసంగం-పాల్గొన్న నేతలు
కడప జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటి హబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తామని హామి ఇచ్చారు చంద్రబాబు.

చంద్రబాబు రోడ్‌షో
తనది, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీది విన్నింగ్ కాంబినేషన్ అని చంద్రబాబు అన్నారు. టిడిపి, బిజెపి పొత్తు కుదిరిన తర్వాత షేర్‌మార్కెట్ అమాంతంగా పెరిగిందన్నారు.

నేతల అభివాదం
కడప ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ నున్న వనరులతో పరిశ్రమలు స్థాపిస్తామని చంద్రబాబు అన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసమేనన్నారు.

జనం లేక వెలవెల
సీమాంధ్రలో సైకిల్ స్పీడ్ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని, బిజెపితో పొత్తు కుదిరిన తర్వాత స్పీడ్ తుపానులా మారి ఆ గాలికి ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications