పిఠాపురం వర్మకు మరోసారి మొండిచేయి..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ఖారారు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేయగా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పేరు ఖారారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావుల పదవీ కాలం పదవీ కాలం ముగియనుంది.
దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీ చేశారు. అటు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డి పేరును ఖరారు చేసింది. ఇదిలా ఉంటే పిఠాపురం వర్మకు మరోసారి నిరాశే ఎదురైంది. గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేయడానికి వర్మ రెడీ అయ్యారు. అయితే టీడీపీ,జనసేన పొత్తు వల్ల అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వర్మ ఒకనొక దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధం అయ్యారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు , వర్మను పిలిపించి మాట్లాడారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపుకు కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో వర్మ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పటికే రెండు దఫా ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేశారు చంద్రబాబు.ఈ రెండు జాబితాల్లో కూడా వర్మ పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదల చేసిన లిస్ట్‌లో కూడా వర్మ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు పార్టీపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications