బాబుకు గడ్డం ఉంది, నాకు లేదు: వెంకయ్య(పిక్చర్స్)

హైదరాబాద్: చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులను చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అసెంబ్లీ ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులంటే ప్రజల్లో చులకన భావం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో ప్రసంగించి సభ్యులను ఉర్రూతలూగించారు. చంద్రబాబు, వెంకయ్య ఒకటే అని కొంత మంది అంటున్నారని, మేమిద్దరం ఒక్కటే ఎలా అవుతాం, బాబుకు గడ్డం ఉంది, నాకు గడ్డం లేదు కదా? అని అయన అనగానే అందరూ పెద్దగా నవ్వారు. సభలో జాగ్రత్తగా ఉండాలని, పొరపాటున గుర్రు పెడితే మీడియాలో హైలైట్ అవుతుందని సూచించారు. ఇలా వెంకయ్య నాయుడు ప్రసంగం ఆద్యంతమూ ఛలోక్తులతో సాగింది.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులను చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అసెంబ్లీ ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులంటే ప్రజల్లో చులకన భావం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో ప్రసంగించి సభ్యులను ఉర్రూతలూగించారు.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

చంద్రబాబు, వెంకయ్య ఒకటే అని కొంత మంది అంటున్నారని, మేమిద్దరం ఒక్కటే ఎలా అవుతాం, బాబుకు గడ్డం ఉంది, నాకు గడ్డం లేదు కదా? అని అయన అనగానే అందరూ పెద్దగా నవ్వారు.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

సభలో జాగ్రత్తగా ఉండాలని, పొరపాటున గుర్రు పెడితే మీడియాలో హైలైట్ అవుతుందని సూచించారు. ఇలా వెంకయ్య నాయుడు ప్రసంగం ఆద్యంతమూ ఛలోక్తులతో సాగింది.

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 173 మంది హాజరయ్యారు. పిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాలేదు.

ప్రజాప్రతినిధులు సభలు, సమావేశాలకే కాకుండా పెళ్ళిళ్లు, పేరంటాలకు, కర్మకాండలకూ వెళ్ళాల్సి వస్తుందని, ఆ ఒక్కటీ తప్ప అన్నింటికీ వెళ్ళాల్సి ఉంటుందని ఆయన చెప్పగానే సభికులు నవ్వాపుకోలేకపోయారు. అయితే నియోజకవర్గంలో ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళలేకపోతే మృతుని కుటుంబ సభ్యులకు మొబైల్ ద్వారా మెస్సెజ్ పెట్టాలని అన్నారు. ఎస్‌ఎంఎస్ చేసేప్పుడు జాగ్రత్త తీసుకోవాలని, పొరపాటున ‘శుభాకాంక్షలు' అనే ఎస్‌ఎంఎస్ పెడితే మన పని అవుట్ అని వెంకయ్య నాయుడు చెప్పగానే చంద్రబాబుతో సహా అందరూ పెద్దగా, కడుపుబ్బ నవ్వారు

జగన్ గైర్హాజరు

అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 173 మంది హాజరయ్యారు. పిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాలేదు. కాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 98 మంది మొదటిసారి ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+